అహంకారం
మహాభారతంలో భీముడికి ఉన్నంత బలం మరెవరికీ లేదట. వెయ్యి ఏనుగుల బలం ఉండేదట!! అంత బలశాలి.. ఇంత భీముడికి తన శక్తిని చూసుకొని అహంకారం వొచ్చిందట!అరణ్యవాసం చేస్తుండగా ఒక రోజు, అతనిని దూరంగా ఉన్న ఒక కొండ పైన చిన్న పువ్వు తీసుకొని రమ్మని చెప్పగా, అతనికి దారిలో ఒక ముసలి కోతి తోక అడ్డం వొచ్చిందట. మర్యాద కొలది, శాస్త్రం ప్రకారం దాటకూడదు కాబట్టి "ఏయ్ కోతి, దారి తొలగు" అని అన్నాడట. ముసలి వాడినని నువ్వే అంటున్నావ్ కదూ, నువ్వే కాస్త నా తోక పక్కకి తీసి వెళ్ళిపో నాయన అన్నదట ఆ కోతి. "ఓస్! అదెంత పనిలే" అనుకోని ఒక చేతితో తీయబోయాడట...ఒక చేతితో కాదు కదా, మొత్తం వెయ్యి ఏనుగుల శక్తి పెట్టిన ఒక అంగుళం కూడా కదలలేదట. అప్పుడు అర్థం అయ్యింది అది సాధారణ కోతి కాదు, హనుమంతులవారని! గర్వంతో పాటు అహంకారం కూడా పోయి నమస్కరించి ఆశీస్సులు తీసుకొని ముందుకు వెళ్ళాడట!! అహంకారం అంత ప్రమాదకరమైనది. నువ్వు చేసే పని కానీ, నీకు ఉన్న ఐశ్వర్యం కానీ, నీది అని నువ్వు గొప్పగా చెప్పుకునేది ఏదైనా కాని, నీలో అహంకారం పెంచి నీ నడుం వొంచుతుంది! నీ కన్నా గొప్పవాళ్ళు అన్నింటా ఉంటారు మిత్రమా. తస్మాత్ జాగ్రత్త!!!