మర్యాద
ఒకడు వాడికి ఉద్యోగం వచ్చాక ఇంట్లో వాళ్ళు మర్యాద ఇవ్వడం మొదలు పెట్టారు అన్నాడంట! అంటే డబ్బుకే విలువ, నాకు కాదు అని కోపం కూడా వొచ్చిందంట. అది విన్న ఒక పెద్దాయన "ఒరేయ్ వెధవ! నువ్వు సంపాదించే డబ్బు వాళ్ళకి కావాలని నీకు మర్యాద ఇవ్వట్లేదు. నీ డబ్బు నువ్వు సంపాదించుకుంటున్నావ్, నీ బ్రతుకు నువ్వు నెట్టుకొస్తావ్, బాధ్యత తెలుస్కుంటున్నావ్ అని గర్వంతో మర్యాద ఇస్తున్నారు" అని చెప్పారట. ఈ కోణంలో వాడు ఆలోచించలేడు, కుర్రతనం...ఈయన మాత్రమే చెప్పగలడు, పెద్దరికం... పైగా అనుభవం! అందుకే కుర్ర వేధవల్లారా తెలుసుకోండి, మర్యాద భాధ్యతకి, డబ్బుకి కాదు.