Posts

Showing posts from October, 2025

సాయం సంధ్య

సాయం సంధ్య - పగలు రాత్రి కలిసే సాయంత్ర సమయం. ఊరు విడిచి ఉద్యోగానికి వెళ్ళే ప్రతీ వ్యక్తికి తిరుగు ప్రయాణం బహుశా దీని లాగానే ఉంటుందేమో! కలలు, ఆకలి, ఆశలు, పని, పేరు, పైసలు అన్నీ ఇచ్చి, పరుగు పెట్టించే కాలం ఉదయం ఐతే. అలసట తీర్చేది, అక్కున చేర్చుకునేది, నిజాన్ని చూపించేది రాత్రి. ఉదయం ఉద్యోగం ఐతే, రాత్రి ఊరు. ఈ రెంటికి మధ్య ఉండే చిన్న కలయికే ఈ తిరుగు ప్రయాణం - సాయం సంధ్య. ఇంటిని వదిలిన బరువెక్కిన మనసు, రేపటి కోసం ఆశలు చూపించే ఆలోచన, రెండూ ఉండే సమయం. ఆగి అలసట తీర్చుకోమని రాత్రి చెపితే, రేపటి కోసం పరుగెత్తమని ఉదయం ప్రేరేపిస్తుంది. రెంటికి మధ్య నిత్యం జరిగే సంఘర్షణలో, బహుశా ఎప్పుడూ ఆకలి, ఆశలు, కొరికే గెలుస్తాయేమో.  ఊరు విడిచి ఉద్యోగానికి వెళ్లిన ప్రతీ బాటసారి బ్రతుకులో ఏదో ఒక దశలో వొచ్చే ఉంటుంది ఈ సాయం సంధ్య!! ఒక బాటసారి!!

Corporate facts

Two friends, over a call, are laughing at a corporate joke "accha kaam mat kar bhai, jyada kaam milega (Don't do good work bro, you will get more work to do)" and had a long awkward silence for 10 seconds. They spoke more words in those 10 seconds than the entire 10 min call. Corporate facts!!

Amma

I know a guy...used to say I don't believe in God and if he has to believe, it has to be "I am God" " Aham Brahmasmi".  He used to debate a lot with her that God is not there and she patiently, like nurturing a plant, kept answering him. Sometimes loosing, sometimes teaching & sometimes arguing.... One day she said "Believe in what you want, till you not hurt anyone." He thought he won, she thought he would learn. Years went on and his leniencies changed, ideologies modified. He still might not believe in God completely but definitely understood if GOD must be there, he was arguing with her the wholetime.  Only after she left him, he understood she's the one who thought him everything or make him inspired to learn anything.  He just not lost his partner for discussions, his guide in difficulties, his strength in weakness, he lost his GURU. By, A GUY who lost his GURU...no no, a SON who lost his MOTHER.

నాన్న

కొంత మంది స్నేహితులు, అప్పుడే ఇంకా life lo settle అవుతూ ఉన్నవారు, ఒక సాయంత్రం కూర్చొని మాట్లాడుకుంటూ ఎవరి నాన్నలు గురించి వారు చాడీలు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒకడు "మా నాన్న చాలా గ్రేట్ రా!! చిన్నపుడు నుండి నేను పెద్దయ్యే వరకు మా దగ్గర డబ్బులు లేవు అని తెలియకుండా పెంచాడు! డబ్బులు గురించి ఇంత కష్టపడాలి అని తెలియనివ్వకుండా పెంచాడు!"  అంతా కొన్ని క్షణాలు నిశబ్దం!! అప్పుడే వాళ్ళు కూడా realize అయ్యారేమో, కొంత మందిని నిశబ్దం ఇంకా వీడకుంటే, మరి కొందరిని అశ్రువులు అక్కున చేర్చుకున్నాయి! ఎవరో చెప్పినట్టు, "మనం అమ్మని అంబరం ఎక్కించినంత, నాన్నకి పల్లకి పట్టలేదేమో ఇప్పటికీ!" "చిన్నప్పుడు గుడికి వెళ్ళినపుడు దేవుడు కనిపించట్లేదు అని ఏడుస్తే, తన భుజాల మీద ఎక్కించి దేవుడ్ని చూపించినపుడు మనకి తెలియలేదు, మనం దేవుడి మీదే కూర్చున్నామని!" "మన జల్సాలు ఎంత వరకు రా అంటే, నాన్న డబ్బులు ఖర్చు పెట్టేంత వరకేనంట!" ఎన్ని కవితలు రాస్తే అతని గొప్పతనం తెలుస్తుంది? ఎన్ని పాటలు పాడితే, అతని కష్టం కనిపిస్తుంది? ఎన్ని చేసినా సరిపోదేమో కదా!! అలాంటి ఎంతో మంది నాన్నలకి🙏🙏