గూడు దాటిన పక్షి
అందరూ గూటి నుండి ఎగిరిన పక్షి మళ్ళీ గూటికే వొస్తుంది అంటారు...
పక్షి కదండీ వొస్తుంది. మనిషి అలా కాదు...
మనిషి ఒక సారి ఇల్లు దాటినా, ఊరు దాటినా ఇంక వాడి ఇల్లు వాడి ఇల్లు కాదు...అద్దె ఇల్లే!! వస్తాడు, అద్దెకు ఉన్న వాడిలా నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతాడు. ఊరు వాడిది కాదు, అది కేవలం వాడి అమ్మ గారి ఊరో నాన్న గారి ఊరో అవుతుంది ఇంక!!
తన వాళ్ళ కోసం డబ్బులు సంపాదిస్తా అంటూ బయటికి వెళ్తాడు, తన వాళ్ళని తప్ప అన్నీ సంపాదిస్తాడు! పిల్లల కోసమే అంతా అంటాడు, ఆ పిల్లలు ఎప్పుడు పెద్ద అయిపోయారో కూడా తెలియకుండా ఉంటాడు.
కలలు కోసం కదిలా బయటికి అంటాడు...బయటికి వొచ్చాక ఏం కల కన్నాడో పక్కన పెట్టు, ఎప్పుడు పడుకున్నాడో కూడా మరిచిపోతాడు!!
గూడు దాటిన ఎన్నో పక్షులు కథ ఇదే!
ఒక గూడు దాటిన పక్షి....
Comments
Post a Comment