Co-Living of Species
చిన్నప్పుడు మామిడి పళ్లు మొత్తం జుర్రి జుర్రి తింటుంటే అమ్మ తిట్టేది "అలా తింటే మేకలు ఏడుస్తాయిరా" అని. అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే అర్థం అవ్తుంది. మన పెద్ద వాళ్ళు co-living of species గురించి మాట్లాడుతున్నారు అని. పండులో, తిండిలో కాస్త అలా విదిలిస్తే ఏ ఆవో, కుక్కో, మేకో తిని వాటి పొట్ట కాస్తైనా నింపుకుంటాయని!
ఎంత గొప్ప ఆలోచనండి!
ఇప్పుడు అలా చెప్పే అమ్మలూ లేరు, బయట తినడానికి మేకలు లేవు. High rise buildings, group houses, gated communities లో ఉంటున్నాం కదండీ..
ఇప్పటికీ ఈ విషయాలు చెప్తున్న తల్లులకు, పాటిస్తున్న కుటుంబాలకు నా నమస్కారం!
Comments
Post a Comment