"ఈ కాలం పిల్లలు"

"అదేమిటో ఈ కాలం పిల్లలు దేవుళ్లలో చెడుని, రాక్షసుల్లో మంచిని వెతుకున్నారు" అంటున్నారే కానీ, ఎందుకు అని ఆలోచించరేం?

కొన్ని తరాల ముందు వరకు ఏ విషయం మీదనైన ఒక చర్చ, ఒక తర్కం జరిగేవి. దానికి వయసు అడ్డంకి ఎప్పుడు అవ్వలేదు కూడాను. మా తరానికి కొన్ని తరాల ముందు వారికి ఎందుకు అనే ప్రశ్నని అడగనివ్వలేదు (అనేక కారణాలు, వాళ్ళ తప్పు కాదు). ఆ తర్వాత తరం వారికి ఎందుకు అనే ప్రశ్నే నచ్చేది కాదు. మా తరం వాళ్ళు వొచ్చి "ఎందుకు" అని మొదలుపెట్టాక, కొందరు తెలియక, మరి కొందరు వారికి తెలియదు అని చెప్పడం ఇష్టం లేక ప్రశ్నలకు అడ్డుకట్ట కట్టారు.

అప్పట్లో ప్రపంచ జ్ఞానాన్ని పుస్తకాల్లో క్లప్తికరిస్తే, ఇప్పుడు దాన్ని మొబైల్ లోకి సూక్ష్మీకరించారు. అందువల్ల ఎవరికి అర్థమైనది వారు, ఎవరికి నచ్చింది వారు తీస్కొని ప్రచారం చేస్తున్నారు.

మీరు మళ్ళీ మమల్ని సరిచేయండి, సూక్ష్మాలు చెప్పండి, జ్ఞానం పెంచండి. మళ్ళీ మన సనాతన జ్ఞానాన్ని తిరిగి తీసుకురండి. మమల్ని మళ్ళీ ప్రశ్నలు అడగనివ్వండి. తర్క వితర్కలు (వాదన కాదు) వల్ల మాత్రమే నిలబడ్డ సంస్కృతి మనది. మళ్ళీ కొనసాగిద్దాం.

భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడ్ని ప్రశ్నిస్తే, కృష్ణుడు "నీకేమి తెలీదు. నువ్వు ఆట్టే విను. వాదించకు, అర్ధజ్ఞాని!" అనలేదు కదండీ! వివరించాడు. మా అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చి తర్వాతి తరానికి అందచెయ్యనివ్వండి!!

Comments

Popular posts from this blog

అహంకారం

Wandering Soul

నాన్న