ఆశ..ఆర్తి


నేను విన్న కథలలో, నాకు వొచ్చిన తెలుగుతో ఈ రోజు రెండు తెలుగు పదాలు అందరికీ కాకపోయినా కొందరికైనా తెలిసేలా చెప్దాం అనుకుంటున్నా...

ఆశ....ఆర్తి

చూస్తే, రెంటికి ఒకలాంటి అర్థమే ఉంటుంది, కానీ కాస్త తేడా ఉందండోయ్!

మొసలి కాలు పట్టుకునప్పుడు, గజేంద్రుడు చాలా ప్రయత్నించాక, విష్ణు మూర్తిని పిలిచాడట. పిలుస్తూ పిలుస్తూ ప్రయతిస్తూనే ఉన్నాడట. ఇది ఆశ. కానీ, అప్పుడు విష్ణువు రాలేదట! 

చివరికి, నేను ఇంక ఏమి చేయలేని వాడినయా, నువ్వే ఇహ దిక్కు అని ఒక్క సారి పిలిచాడట... అంతే!!

సిరికిన్ చెప్పడు, శంఖ చక్ర యుగముల చెదోయి సందింపడు....అని పోతన గారు చెప్పినట్టు, పరుగున వొచ్చాడట!!

ఇది ఆర్తి!

కొన్ని సార్లు, కళ్ళు ఆశతో కాదు, ఆర్తితో వెతకాలి. అది దేవుడినైనా, సమస్యకి సమాధానమైనా!!

ఆర్తితో వెతకమంటే అన్ని వొదిలేయమని కాదండోయ్!! ప్రయత్నం మాత్రం వొదల కూడదు! గజేంద్రుడు మొసలితో పోరాటం ఆపేశాడు కానీ, విష్ణువుని పిలవడం ఆపలేదు. 

Comments

Popular posts from this blog

అహంకారం

Wandering Soul

నాన్న