ఎందుకు?
చిన్నప్పుడు అన్నింటికి ఎందుకు ఎందుకు అని అడిగేవాడినట! పెద్దయ్యాక కాలేజిలో ఎందుకు అని అడగటం నాకు గుర్తుంది! ఉద్యోగం స్టార్ట్ చేసిన తర్వాత మా seniors ని అడిగే వాడిని..
అప్పుడు నచ్చిన ఈ "ఎందుకు" అనే ప్రశ్న ఇప్పుడు irritate చేస్తుంది.
మా టీచర్లు, అమ్మ నాన్నలు, seniors అంతా గెట్టిగా కోరుకొని ఉండి ఉంటారు, "వీడిని కూడా ఇలానే ఎందుకు అని అడిగేవాళ్ళు తగలాలి" అని.
Double, triple effectతో వొచ్చింది నా కూతురు!
నా కూతురు ఎందుకు అని అడిగిన ప్రతిసారి, నేను ఎందుకు అని అడిగిన ప్రతి ఒక్కరు గుర్తొస్తున్నారు.
ఈ ఎందుకు అనే ప్రశ్నని ban చేసేయాలి అసల!😭
Comments
Post a Comment