సిరా


ఎరా కవి, కలం కదలట్లేదా ఈ మధ్య?? తెల్ల కాగితాలు నల్లగా అవ్వట్లేదు. సిరా ఏమైనా అయిపోయిందా??

"లేదు గురూ, సిరా లోపలే ఉంది. బయటికి రానని మారం చేస్తుంది. కాస్త వెచ్చతనం తగిలితే మళ్ళీ షరా మామూలే!!"

మరింకేం కానివ్వు...

"మామూలు సిరా ఐతే, చేతి వెచ్చదనానికి కరుగుతుంది...కవి సిరా కదూ, మనసు వెచ్చదనానికి కరుగుతుంది."

పోనిలే, అది అయ్యేంత వరకు నీ కవి(పి)త్వం నుండి మేము బతికిపోయాం!!

"అబ్బే!! కవి హృదయానికి విలువే లేకుండా పోయింది గురూ, ఇంకెక్కడ కరుగుతుంది సిరా!"

ఓ కలం కదలని కవి కథ!

Comments

Popular posts from this blog

అహంకారం

Wandering Soul

నాన్న